Wednesday, April 2, 2025

రామగుండంలో విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పికె రామయ్య కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కుంటలో ఈతకు దిగినట్లు సమాచారం. మృతులను విక్రమ్, ఉమామహేశ్, సాయి చరణ్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News