Monday, December 23, 2024

దక్షిణకొరియాలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 151 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Tragedy in South Korea: 151 dead

సియోల్: దక్షిణకొరియాలో తీవ్ర విషాదం నెలకొంది. హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 151 మంది దుర్మరణం చెందగా వందకుపైగా గాయపడ్డారు. రోడ్లపై గాయాలతో పడి ఉన్న వారిని చూసి అత్యవసర సిబ్బంది, పాదచారులు ప్రథమ చికిత్స చేశారు. సినీ తారను చూసేందుకు ఇరుకైన వీధిలో జనం పరుగులు తీయడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మృతులు, క్షతగాత్రులలో అత్యధిక మంది 20 ఏళ్లలోపు యువతేనని తెలిపారు. ఘటనపై దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News