Monday, December 23, 2024

పేదింట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: బాసర ట్రిపుల్ ఐటిలో ప్రధమ సంవత్సరం చదువుతున్న గజ్వేల్‌కు చెందిన బుర్ర లిఖిత(16) అనే విద్యా కుసుమం గురువారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం పై అంతస్థు నుంచి కింద పడి దుర్మరణం పాలైందని తెలుస్తోంది. ఈ విషాద సంఘటన తెలియగానే దిగ్భ్రాంతికి గురైన తల్లితండ్రులు బంధువులు రోధిస్తూ వెంటనే బాసరకు బయలుదేరి వెళ్లారు.

బతుకు దెరువు వెతుక్కొంటూ…

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం తిప్పారం గ్రామానికి చెందిన బుర్ర రాజు గౌడ్ రేణుకలు జీవనోపాధి వెతుక్కుంటూ కొన్నేళ్ల కిందట గజ్వేల్ పట్టణానికి వచ్చారు. వారికి లిఖిత, లోహిత అనే ఇద్దరు ఆడపిల్లలు, భరత్ అనే కుమారుడు ఉన్నారు. గజ్వేల్ పట్టణంలో బస్టాండు వెనుక ఉన్న మజీదు సమీపంలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్న రాజు కుటుంబం తన పిల్లల పోషణ కోసం బ స్టాండు సమీపంలో రోడ్డు పక్కన ఒక మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అలా పేదరికంలోనైనా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో రాజు పిల్లలు మాత్రం చదువులో మేటిగా రాణిస్తుండటం వారికి ఒక వరంగా మా రింది. పెద్ద కుమార్తె లిఖిత గజ్వేల్ పట్టణంలోనే మోడల్ స్కూల్‌లో ఇటీవలే ప దోతరగతి లో ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు పదికి పది జిపిఎ సాధించిన లిఖితకు ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో సీటు వచ్చింది.

దాంతో తమ కూ తురు భవిష్యత్ బంగారు బాట అవుతుందని ఆమె తల్లి తండ్రులు ఎంతో సంతోషించారు. లిఖిత ప్రస్తుతం ట్రిపుల్ ఐటిలో మొదటి సంవత్సరం పూర్తి కావచ్చిం ది. గురువారం తెలవారు జామున సుమారు 2 గంటల ప్రాంతంలో ట్రిపుల్ ఐటి హాస్టల్ భవనంపై అంతస్తు నుంచి కిందపడి పోయిందంటున్నారు. కొనూపిరితో ఉన్న లిఖితను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందిందని ట్రిపుల్ ఐటి అధికారులు చెపుతున్నట్లు మృతురాలి బంధువులు అంటున్నారు. లిఖిత చెల్లెలు లోహిత గజ్వేల్ మోడల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి, తమ్ముడు భరత్ మరో ప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నా రు. రాజు రేణుకల నిరుపేద కుటుంబంలో విద్యాకుసుమం అయిన లిఖిత ఇ లా అర్థంతరంగాప్రాణాలు కోల్పోవటం అందరిని విషాదంలోకి నెట్టింది. ఉన్న ఆకుటుంబంలో చదువుల తల్లి కొలువు దీరినట్టున్న ముగ్గురు పిల్లలతో నిత్యం కళకళలాడిన ఆ ఇల్లు ఇప్పుడు భయంకర నిశ్శబ్ధంతో విషాదం నిండిన వాతావరణంలో పట్టణంలోని ఆ వీధిలో ఉన్న ఇరుగు పొరుగును కలచి వేస్తోంది.

బాధిత కటుంబానికి ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పరామర్శ

బాసర త్రిబుల్ ఐటీలో మృతి చెందిన లిఖిత మృతదేహం గురువారం రాత్రి కుకునూరుపల్లి మండలం తిప్పారంకు చేరింది సమాచారం అందిన వెంటనే ఎఫ్‌డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల తల్లిదండ్రులను ఓదార్చిన ఎఫ్‌డిసి చైర్మన్ వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News