- Advertisement -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. అత్తాకోడళ్లు మృతిచెందారు. గుండెపోటుతో ఆదివారం ఉదయం అత్త భారతమ్మ చనిపోయింది. అత్త మృతదేహం వద్ద రోదిస్తూ మనస్థాపంలో కోడలు మృతిచెందింది. యాదగిరిగుట్ట మండలం గొల్లగెడిసెల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -