- Advertisement -
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కొడుకును కిరాతకంగా చంపి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిరాజ్ అనే వ్యక్తి.. తన భార్య గొంతు కోసి.. కొడుకు గొంతు నులిమి హత్య చేశాడు.
తల్లిని, సోదరుడిని తన తండ్రి చంపుతుండగా చూసిన మరో కుమారుడు భయంతో కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టాడు. అనంతరం సిరాజ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -