Wednesday, January 22, 2025

విద్యా దినోత్సవం సంబరాల్లో విషాదం

- Advertisement -
- Advertisement -

కమలాపూర్: మండలంలోని మర్రిపల్లి గూడేం గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి ప్రాథమిక పాఠశాలలో 5వతరగతి పూర్తి చేసుకుని ఈ విద్యాసంవత్సరం 6వతరగతిలో ప్రవేశం కోసం హైస్కూల్‌కు వెళ్లాడు. విద్యా దినోత్సవం సందర్భంగా ర్యాలీ తీస్తున్న క్రమంలో ప్రక్కనే ఉన్న కిరాణం షాప్‌లో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటుండగా కుక్కలు వెంబడించడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్ క్రిందపడి మృతి చెందాడు.

దింతో తల్లిదండ్రులు జయపాల్ స్వప్నలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దినేష్ మృతితో ఉపాధ్యాయులు తోటి స్నేహితులు, విద్యార్థులు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలసుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని సందర్శించి బాలుడి కుటుంబాన్ని ఓదార్చారు. విషయం తెలసుకున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విద్యార్థి తల్లిదండ్రులతో, గ్రామస్తులతో ఫోన్ల్లో మాట్లాడి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News