Friday, January 10, 2025

తిరుమల నడక దారిలో పెను విషాదం

- Advertisement -
- Advertisement -

చిరుతదాడిలో ఆరేళ్ల చిన్నారి దుర్మరణం

అలిపిరి మార్గంలో దుర్ఘటన

ఆగని చిరుత దాడులతో భక్తుల్లో భయాందోళన

జూన్ 22న బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత

కుటుంబసభ్యుల కేకలతో బాలుడిని వదిలి పారిపోయిన పులి
2009లోనూ ఇలాంటి ఘటనే

ఏడో మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్
ప్రతి 10మీటర్లకు భద్రతా సిబ్బంది పహరా

ఇకపై సాయంత్రం 6 వరకే అనుమతి: టిటిడి ఈవో

మన తెలంగాణ/హైదరాబాద్:  అలిపిరి నడక మార్గంలో విషాదం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. చిరుతదాడిలో తీవ్రంగా గాయపడిన లక్షిత మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన మొక్కును తీర్చుకోవడానికి బయల్దేరింది లక్షిత ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడు కొండల వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు. పదిమంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. అలిపిరిలోని నడక మార్గంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది. సిసి కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా అందరి కంటే చురుగా మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకునే సరికి పాప కనిపించలేదు. రాత్రి వేళలో పాప లక్షిత కనిపించకపోయే సరికి తల్లిదండ్రులతోపాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది. మొత్తం వెతికారు. పిలిచారు, అయినా లక్షిత పలకలేదు. ఏం జరిగిందో ఏమో అనుకున్నారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పాప కనిపించడం లేదని తెలుసుకున్న టిటిడి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వడివడిగా ముందుకు నడుకుంటూ వెళ్లిన పాపను ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారేమో అన్న కోణంలోనే వేట సాగించారు.
పాప మృతదేహాన్ని గుర్తించిన భక్తులు
రాత్రంగా గాలింపు చర్యలు చేపట్టినా పోలీసులు, టిటిడి సిబ్బంది పాప కనిపించలేదు. శనివారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అయితే కాలినడకన వెళ్తున్న భక్తులకు లక్షిత డెడ్‌బాడీ కనిపించింది. చాలా మంది ఆ దృ శ్యాలను చూసి భయపడిపోయారు. వెంటనే కొం దరు తిరుమల సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి డెడ్‌బాడీని పరిశీలించారు. ఫ్యామిలీ చెప్పిన ఆనవాళ్లు ఉండటంతో అది లక్షిత మృతదేహంగా గుర్తించారు. భక్తుల ద్వారా సమాచారం విషయం బయటకు వచ్చింది. పాప మృతదేహాన్ని పాస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. మొదట ఇది చిరుత దాడి అంటూ చెప్పిన అధికారులు తర్వాత మాట మార్చారు. చిరుత దాడి చేసే అవకాశం లేదని ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమాన పడ్డారు. దీంతో అందరిలోనూ అనుమానాలు కలిగాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడి లో పాప చనిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. రు యా ఆసుపత్రిలో పోస్టు మార్టం చేసిన తర్వాత లక్షిత డెడ్‌బాడీని నెల్లూరు జిల్లాలోని స్వస్థలానికి తరిలించారు. చెంగుచెంగున లేడి పిల్లలా ఎగురు తూ కళ్లెదుటే మెట్లు ఎక్కిన చిన్నారి ఇలా కనిపించే సరికి దినేశ్ ఫ్యామిలి షాక్ తింది. వారి రోధనలకు అంతులేకుండా పోయింది. తల్లిదండ్రులతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు ఏడుపు అక్కడి వారందరనీ కంట తడి పెట్టించింది.
జూన్ 22న బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత
తిరుమల అలిపిరి నడక మార్గంలో తరచూ చిరుత భయ పెడుతోంది. జూన్‌లో కూడా ఓ బాలుడిని ఎత్తుకెళ్లింది. ఏడో మైలు వద్ద చిరుత ఐదేళ్ళ బాలుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. బాలుడితో పాటుగా ఉన్న బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించడంతో దాదాపు 150 మీటర్ల దూరంలో చిరు త బాలుడిని వదిలి వెళ్ళింది. ఐతే అటవీ ప్రాంతం లో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన అటవీ శాఖ ఉద్యోగి సురక్షితంగా అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చి టిటిడి విజిలెన్స్, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయా లు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న టిటిడి ఇవో ఎవి ధర్మారెడ్డి సంఘటన స్ధలానికి చేరుకుని బాలుడిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చిరుత దాడి ఘటనలో గాయపడ్డ బాలుడిని టిటిడి ఇఒ ధర్మారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించిన అధికారులు సురక్షింతంగా బాలుడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. 2009లో కూడా నడక మార్గంలో ఓ చిన్నారి పై అటాక్ చేసింది. భక్తులు వెంటనే రియాక్ట్ కావడంతో పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. పాప గాయాలతో సురక్షితంగా బయటపడింది.
భక్తుల భద్రతపై టిటిడి కీలక నిర్ణయం
తిరుమల అలిపిరి నడకదారిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘ టన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్, నడక దారిలో భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యం లో టిటిడి ఇవో ధర్మారెడ్డి స్పందించారు. చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అటవీ శాఖ, పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యా రు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ అలిపిరిలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నారి తప్పిపోయిందని చెప్పారు. చిన్నారి ఆచూకీ కోసం దాదాపు 70 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని ఇవో తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి కాలినడక మార్గంలో చిరుత దాడి ఘటన జరగలేదని.. ఆయితే బాలిక అటవీ ప్రాంతంలోకి ఏమైనా వెళ్లిందా? అన్న కోణంలో విచారణ చేపట్టామన్నా రు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చే శామన్నారు. భక్తల భద్రతను దృష్టిలో వుంచుకుని సాయంత్రం 6 గంటలకు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసేయాలని దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రతి పది మీటర్లకు భద్రతా సిబ్బందిని నియమిస్తామని, ఇదే సమయంలో చిన్నారుల పట్ల భక్తులు అప్రమత్తంగా వుండాలని ధర్మారెడ్డి సూచించారు. చిన్నారి లక్షిత కుటుంబానికి టిటిడి నుంచి రూ.5 లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని ఇవో పేర్కొన్నారు. మరోవైపు నడక మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహస్వా మి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా టిటిడి ప్రకటించింది. ఈ మార్గంలో వచ్చే భక్తులకు ముందు, వెనుక రోప్‌లను ఏర్పాటు చేయనున్నారు. 100 మంది భక్తుల గుంపును అనుమతించేలా చర్యలు చేపట్టనున్నారు. చిరుత కదలికలను గుర్తించేందు కు అత్యాధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News