Sunday, December 22, 2024

ఎయిర్ షోలో అపశృతి

- Advertisement -
- Advertisement -

తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం నిర్వహించిన మెగా ఎయిర్ షో చూసేందుకు లక్షలాది గా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారని తెలుస్తోంది. వివరా ల్లోకి వెళితే.. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ఆధ్వర్యంలో ఆవివారం ప్రారంభించిన మెగా ఎయిర్‌షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు పోటెత్తారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడటంతో వారంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడినట్లు సమాచారం. తీవ్ర రద్దీ ఉక్కపోతతో దాదాపు 230 మంది సొమ్మసిల్లి పడిపోయారు.

ఎయిర్‌షోకు దాదాపు 10 లక్షల మంది హాజరైనట్లు అంచనా. మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసిన ప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. క్షతగాత్రు లను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకు ఇబ్బంది ఎదు రైంది. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో మెరీనాబీచ్ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టిఎస్ రైల్వేస్గేషన్లు కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. అన్నాస్కేర్‌లోని బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News