Tuesday, December 24, 2024

జమ్మూ కాశ్మీర్ లో విషాదం.. టాక్సీ లోయలో పడి 10మంది మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాక్సీ లోతైన లోయలో పడిపోవడంతో 10మంది మృతి చెందారు. ఈ విషద సంఘటన రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టాక్సీ లోయలో పడిపోయిందని సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు, ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు  జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై రాంబన్ ఎస్ఎస్ పి అనుజ్ కుమార్ మాట్లాడుతూ..”చష్మా బ్యాటరీ ప్రాంతంలో ఈ విషాద సంఘటన జరిగింది… సుమారు 10 మంది ప్రయాణిస్తున్న వాహనం లోతైన గుంటలో పడిపోయింది. పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టి… ఘటనాస్థలం నుంచి10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు” అని తెలిపారు.  ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News