Monday, December 23, 2024

90 రోజుల తర్వాతే మరొకరికి ఫోన్ నంబర్ కేటాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  గోప్యతను దృష్టిలో ఉంచుకుని, ఫోన్ నంబర్ల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. డియాక్టివేట్ అయిన నంబర్లు, రద్దయిన నంబర్ల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పై ట్రాయ్ సమాధానమిస్తూ, అలాంటి మొబైల్ నంబర్లను 90 రోజుల తర్వాతే ఇతరులకు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.

రద్దయిన లేదా డీయాక్టివేట్ అయిన నంబర్ ను వేరొకరికి కేటాయించినప్పుడు, అంతకుముందు ఆ నంబర్ ను వాడిన వ్యక్తి తాలూకు వ్యక్తిగత డేటా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందంటూ సుప్రీంకోర్టులో రెండేళ్ల క్రితం రిట్ దాఖలైంది. ఈ కేసును జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనానికి ట్రాయ్ సమాధానమిస్తూ, వినియోగదారుల డేటా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు 90 రోజుల వ్యవధి పాటిస్తున్నామని తెలిపింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News