Monday, December 23, 2024

కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు : తమ్మినేని వీరభద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర బిజెపి ప్రభుత్వం రైల్వే శాఖ పట్ల అనుసరిస్తున్న నిర్లక్షమే ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి కారణమని సిపిఎం రాష్ట్ర కమిటీ భావిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైల్వే లైన్లు, సిగ్నల్స్ వ్యవస్ధ, ట్రాకుల ఆధునీకరణ, బోగీల మరమ్మతులు, అవసరమైన సదుపాయాలు చేపట్టకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అలాగే, రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయక పోవడం కూడా మరొక కారణమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News