Monday, January 20, 2025

నైజీరియాలో ఘోర ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

లాగోస్: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. అనంతరం బస్సును ట్రాక్ వెంట కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నైజీరియా దేశం లాగోస్ నగరంలోని ఐకెజా ఏరియాలోగల రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 90 మంది ఉన్నారు. బస్సును రైలు డీకొట్టిన ఘటన తెలియగానే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న 90 మంది ప్రయాణికులను వెలికితీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News