Thursday, December 26, 2024

రైలు పట్టాలపై కూలిన విమానం… అప్పుడే రైలు వస్తుంది… కానీ

- Advertisement -
- Advertisement -

Train collided with Aeroplane

న్యూయార్క్: అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌లో విమానం కూలిపోయి రైలు పట్టాలపై పడింది. కానీ అదే సమయంలో రైలు వస్తుండడంతో ప్రాణాలతో ఉన్న పైలట్ రెండు నిమిషాల వ్యవధిలో బయటకు లాగారు. ఈ దృశం అంతా పోలీస్ బాడీకి ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సెస్నా 72 అనే విమానం ఫెర్నాండో వెల్లి నుంచి టెకాఫ్ తీసుకుంది. లాస్‌ఎంజెల్స్‌లోని ఎల్‌ఎపిడి ఫుట్‌హిల్ డివిజన్ స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌పై విమానం కూలింది. విమానంలో ఉన్న పైలట్‌కు చిన్నపాటి గాయాలతో అందులో చిక్కుకపోయాడు. అదే సమయంలో రైలు వస్తుండడంతో 2.15 నిమిషాల వ్యవధిలో బయటకు లాగారు. అక్కడ ఉన్న వారు ట్రైన్ వస్తుంది త్వరగా త్వరగా లాగాలని అరుపులు కేకలు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News