Tuesday, December 24, 2024

అస్సాంలో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

- Advertisement -
- Advertisement -

దిమా హసావ్ జిల్లాలోని దిబలాంగ్ స్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం అగర్తల-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 3.55 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. పట్టాలు తప్పిన బోగీలలో పవర్ కారు, రైలు ఇంజన్ ఉన్నాయి. ఉందింగ్ నుంచి సీనియర్ రైల్వే అధికారులతోపాటు సహాయక, వైద్య సిబ్బంది బయల్దేరి వెళ్లారు. ఉందింగ్-బదర్‌పూర్ సింగ్ లైన్ హిల్ సెక్షన్‌పై రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News