- Advertisement -
పాసింజర్ రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని భారతీయ రైల్వే తీసుకుంది. పాసింజర్ రైల్ టికెట్ చార్జీలను 50 శాతం మేరకు తగ్గించింది. దీంతో టికెట్ ధరలు కోవిడ్ ముందు ఎంత ఉండేవో అంతకు దిగివచ్చాయి. కోవిడ్-19 మహమ్మారి గురించి ప్రకటన వెలువడిన వెంటనే రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించే ఉద్దేశంతో పాసింజర్ ట్రైన్లలో కనీస టికెట్ ధరను రూ. 10నుంచి రూ. 30కి పెంచారు. పాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ ధరలను ఫిబ్రవరి 27నుంచి మళ్లీ ప్రవేశపెట్టారు.
- Advertisement -