Sunday, December 22, 2024

మెదక్, సిద్దిపేట నుంచి తిరుపతికి రైలు సర్వీస్ నడపాలి:ఎంపి రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్, సిద్దిపేట నుంచి తిరుపతికి రైలు సర్వీస్ నడపాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను కోరారు. జనరల్ మెనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో ఎంపీ రఘునందన్ రావు గురువారం ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపి పలు అంశాలను జిఎంతో చర్చించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని జిఎంకు వినతి పత్రం అందజేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని పూర్వ మెదక్ జిల్లాలోని అనేక రైల్వే పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేయాలని రఘునందన్ రావు కోరారు. పటాన్ చెరు నుంచి మెదక్, అక్కన్న పేట వరకు,

సిద్దిపేట నుంచి పెద్దపల్లి వరకు రైల్వేలైన్లు పొడగించాలని, అజంతా, రాయలసీమ ఎక్స్ ప్రెస్‌లు వడియారం, అక్కన్నపేట రైల్వేస్టేషన్లలో ఆపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేగాక వడియారం, సిద్దిపేట రైల్వేస్టేషన్లలో ర్యాక్ పాయింట్లు నిర్మించాలని కూడా కోరారు. వీటితో పాటు వికారాబాద్ రైల్వేలైన్‌లోని ఏదుల్నాగుపల్లి వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, దీంతో అక్కడ ట్రాఫిక్ రద్దీని, ప్రమాదాలను నివారించవచ్చని ఎంపి సూచించారు. ఈ విషయాలపై సమీక్షించి, తక్షణ చర్యలు చేపడతామని జీఎం హామీ ఇచ్చారని తెలిపారు. తన అభ్యర్ధనలపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినందుకు రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News