Monday, December 23, 2024

బీహార్‌లో రైలుకు పరీక్షార్థుల నిప్పు

- Advertisement -
- Advertisement -
Train set on fire at Bihar
ఆర్‌ఆర్‌బి పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆగ్రహం

పాట్నా/గయ : బీహార్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు రాసిన అభ్యర్థుల నిరసనలు హింసకు దారితీశాయి. బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు విధ్వంస చర్యలకు దిగారు. రైల్వే శాఖ తీరును తప్పుపడుతూ గయలో ఓ ప్యాసింజర్ రైలు బోగీకి బుధవారంనాడు నిప్పుపెట్టారు. మంటల్లో బోగీల్లోని సీట్లు, బెర్తులు పూర్తిగా కాలిపోయాయి. ఆర్‌ఆ్ర్‌బీ-ఎన్‌టీపీపీసీ ఫలితాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు సీతామర్హి రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.

పాట్నాలోని పలు ప్రాంత్రాల్లోనూ అభ్యర్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. కాగా, గయలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని గయ ఎస్‌ఎస్‌పి ఆదిత్య కుమార్ తెలిపారు. నిరసనకారులు ఒక రైలుకు నిప్పుపెట్టారని, వీరిలో పలువురిని గుర్తించామని చెప్పారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, విద్యార్థులు ఎవరి ప్రభావానికి లోనుకావద్దని, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయవద్దని సూచించారు. మరోవైపు విద్యార్థులు ఆందోళనకు దిగడంపై రైల్వే శాఖ మండిపడింది. ఎన్‌టీపీసీ, లెవెల్-1 పరీక్షలను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులలో పాస్, ఫెయిలైన విద్యార్థుల సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News