సిద్దిపేట: కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో అన్నం పెట్టిన ఘనత సిద్దిపేట వైశ్యులకు దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో విఎస్‌ఎస్ కన్వెన్షన్‌ను వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. లక్షన్నర ఓట్ల మెజార్టీతో హరీష్‌రావును గెలిపించాలని ఆర్యవైశ్యుల సంఘం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి సిద్దిపేటకు రైలు సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి బెంగళూరు రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ నెల 5న సిద్దిపేటలో వెయ్యి పడకల ఆస్పత్రి ప్రారంభిస్తామని, త్వరలో సిద్దిపేటలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి…
ఉద్యమ సహచరుడు, సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామలింగన్న యాదిలో దుబ్బాకలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సోలిపేట రామలింగారెడ్డి సేవలు మర్చిపోరన్నారు. జోహర్ రామలింగన్న నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం తోపాటు ప్రజల వద్దకే పాలన అనే నినాదాన్ని నిజం చేసిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.