- Advertisement -
ప్రయాణికులు రైలు టికెట్లను కౌంటర్‌లో కొన్నా, ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేకా 139 ద్వారా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం అన్నారు. అయితే క్యాన్సిల్ డబ్బులు వసూలు చేసుకోడానికి రిజర్వేషన్ సెంటర్ సందర్శించాల్సి ఉంటుందని కూడా తెలిపారు. ‘కౌంటర్ ద్వారా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కొన్న ప్రయాణీకులు టికెటు క్యాన్సిల్ చేయించుకోడానికి రైలు బయలుదేరక ముందే స్టేషన్‌ను సందర్శించాల్సి ఉంటుందా?’అని బిజెపి ఎంపీ మేధా విశ్రం కుల్‌కర్ణి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై విధంగా స్పష్టీకరణ ఇచ్చారు. ‘నిర్ణీత కాలపరిమితిలో ఐఆర్‌సిటిసి లేక 139 ద్వారా కూడా పిఆర్‌ఎస్ టికెట్లను క్యాన్సల్ చేసుకోవచ్చు. అయితే టికెట్‌ను పిఆర్‌ఎస్ కౌంటర్‌లో ఇచ్చే డబ్బులు వాపసు తీసుకోవలసి ఉంటుంది’ అని మంత్రి వివరించారు.
- Advertisement -