ఆరు రోజుల పాటు 6 గంటల పాటు టికెట్ల బుకింగ్ నిలిపివేత
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచన
మనతెలంగాణ,హైదరాబాద్: రైలు టికెట్ల రిజర్వేషన్ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఈ నెల 14, 15వ తేదీల నుంచి 20వ తేదీల అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్‌ఓ రాకేశ్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల నెంబర్లకు బదులుగా ఇకపై సాధారణ రైళ్ల నెంబర్లతో నడుపుతామని తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు .కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా భారతీయ రైల్వే సర్వీసులను దశల వారీగా ప్రవేశపెడుతోంది. ప్రత్యేక ఛార్జీలతో ప్రత్యేక రైళ్లుగా రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎమ్‌ఎస్‌పిసి, ఇహెచ్‌ఎస్‌పి రైళ్ల సర్వీసులను, సాధారణ రైళ్ల నెంబర్లతోసంబంధిత క్లాసుల చార్జీలతో 2021 సమయసారని ప్రకారం మార్గదర్శకాలను అనుసరించి నడిపించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించిందని తెలిపారు.భారతీయ రైల్వే ఈ మార్పులను అనుసరించి రిజర్వ్‌డ్ రైళ్ల నెంబర్లను అప్‌లోడ్ చేస్తోంది.
దీనికి సంబంధించి అన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల గతంలోని (పాత రైళ్లు నెంబర్లు) మరియు ప్రస్తుత ప్యాసింజర్ బుకింగ్ డేటా అప్‌డేట్ చేయాల్సి ఉంది. ఇది జాగ్రత్తగా క్రమ పద్దతిలో చేయాల్సి ఉంటుందని, దీంతో టికెటింగ్ సర్వీసులు ప్రభావితం కాకుండా రాత్రి సమయాలలో చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రయాణికుల రైళ్లను సాధారణ స్థాయికి తెచ్చేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది.ఈ ప్రక్రియలో భాగంగా రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పీఆర్‌ఎస్) 2021 నవంబర్, 14,15 తేదీల నుంచి నవంబర్ 19,200 తేదీల వరకు ప్రతి రోజు అర్థరాత్రి 23.30 గంటల నుంచి 05.30 గంటల వరకు అందుబాటులో టికెట్ల రిజర్వేషన్లు ఉండవని తెలిపారు.
ఈ సమయాల్లో (23.30 నుంచి 05.30 గంటల వరకు) పీఆర్‌ఎస్ (టికెట్ రిజర్వేషన్లు, కరెంటు బుకింగ్, టికెట్ల రద్దు వంటి సేవలు) అందుబాటులో ఉండవు. పిఆర్‌ఎస్ సేవలు మినహా 139 టెలిపోన్ సేవలతో సహా మిగతా అన్ని విచారణ సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా అందుబాటులో ఉంటాయి. ఈ సమయాల్లో టికెట్ రిజర్వేషన్ బుకింగ్ అందుబాటులో ఉండదని, రైళ్ల నెంబర్లలో మార్పులు చేయబడినవని గమనించాలని కోరారు.మార్పు చేసిన రైళ్ల నెంబర్లు ప్రయాణికులకు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలియజేస్తామన్నారు.