Friday, November 15, 2024

కెసిఆర్ పట్టుదలతోనే సిద్దిపేటకు రైలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట ప్రజల దశాబ్దాల రైలు కల మంగళవారం సాకారమైంది. దేశ ప్రదాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా రైలును ప్రారంభించగా జి ల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరో గ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. బిఆర్‌ఎస్, బిజేపి నాయకులు పెద్ద సంఖ్యలో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొని ఒకరిపై మరొకరు నినాదాలు చేసుకున్నారు. అలాగే ప్లెక్సీలు చింపుకుంటూ కుర్చీలను విసురుకున్నారు. స్వల్ప ఉద్రికత్తత మధ్య రైలు ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. రైలు ప్రారంభం అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డితో పాటు తదితరులు రైలులో ప్రయాణించారు. సిద్దిపేటకు రైలు రావడం పట్ల ప్రజలు ఎంతో హర్షం వక్యం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని తమ ఆనందా న్ని వెలిబుచ్చుకున్నారు.

కెసిఆర్ పట్టుదలతోనే సిద్దిపేటకు రైలు..
కెసిఆర్ సిఎం అ య్యాడు కాబట్టే సిద్దిపేటకు రైలు వచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఐఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేటకు 2006లోనే రైల్వేలైన్ మంజూరు చేయించారని గుర్తు చేశారు. రాష్ట్ర వాటాను భరించలేమని కాంగ్రెస్ పాలకులు రైల్వే లైన్ ని ర్మాణ పనులు జరపలేదన్నారు. కెసిఆర్ పాలనలోనే మెద క్, సిద్దిపేటకు రైలు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రిగా రైల్వే లైన్ మంజూరు చేయించి నాడు సిఎం హోదాలో కెసిఆర్ రైళ్లను పరిగెత్తిస్తున్నారన్నారు. జిల్లాలో రైల్వే లైన్ కోసం 2508 ఎకరాల భూ సేకరణకు సంబంధించి రూ. 310 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందన్నారు. అలాగే రాష్ట్ర వాటా కింద కేంద్ర ప్రభుత్వానికి రూ. 330 కోట్లు చెల్లించామన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టిన వర్చువల్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ఫొటో పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు.

బిజెపి వల్లనే సిద్దిపేటకు రైలు వచ్చిందని ఆ పార్టీ నా యకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను ఒప్పించి భూ సేకరణ చేపట్టింది తామేనన్నారు. కనీసం ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఫొటో సైతం ప్రారంభోత్సవంలో వాడకపోవడం బిజెపి కక్షపూరిత తనానికి నిదర్శనమన్నా రు. సిద్దిపేటకు రైలు రావడం సిద్దిపేట ప్రజల విజయమన్నారు. కెసిఆర్ పట్టుదలతోనే రైలు రావడం ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. సిఎం కెసిఆర్‌కు జిల్లా ప్ర జల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీచైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News