Monday, December 23, 2024

రైలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా..

- Advertisement -
- Advertisement -

విజయనగరం: కంటకాపల్లి జంక్షన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం అందజేయనున్నట్లు పేర్కొంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని ఎపి ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 14మంది మృది చెందగా.. 100కు పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News