పెళ్లి పేరుతో మోసగించినట్టు ఆరోపణ
పెళ్లి పేరుతో మోసగించాడని
ట్రైనీ ఐఎస్ఎస్పై యువతి ఫిర్యాదు
కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: ట్రైనీ ఐఎఎస్ తనను పెళ్లిపేరుతో నమ్మించి మోసగించాడని హైదరాబాద్ కూకట్పల్లి పోలీ స్స్టేషన్లో ఓ యువతి చేసిన ఫిర్యాదు ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. సదరు బాధిత యువతి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు ట్రైనీ ఐఎఎస్, అతడి తండ్రిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మ్మం జిల్లా వైరా టిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ బానోతు మదన్‌లాల్ కు మారుడు బానోతు మృగేందర్ ఓ తాను కజిన్ అవుతానంటూ ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్నాడని తెలిపింది. గతంలో మృగందర్ ఐపిఎస్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు పరిచయమయ్యాడని, ప్రస్తుతం అతను మధురైలో ఐఎఎస్ శిక్షణాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు బాధిత యువతి ఫిర్యాదు పేర్కొంది. ఐపిఎస్ శిక్షణ తీసుకుంటున్న సమయం లో ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని, ఈక్రమంలో గతంలో మృగం దర్ లాల్ ఐపిఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో తనను పోలీస్ అకాడమీకి పిలిపించి తన గదిలోనే పలుమార్లు లైంగికంగా దాడిచేసిన ట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది.
చివరికి పెళ్లి చేసుకోవాలని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. అయితే తనతో సంబంధం కొన సాగిస్తూనే బానోతు మృగందర్ యూపికి చెందిన తన బ్యాచ్మెట్తో పెళ్ళి నిశ్చయం చేసుకున్నాడని ఫిర్యాదులో వివరించింది. ఈక్రమంలో తనకు జరిగిన అన్యాయాన్ని నిందితుడి తండ్రి బానోతు మదన్‌లాల్‌కు వివరించగా ఆయన పలుమార్లు తనను బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. కొడుకు చేసే పనులకు తండ్రి అండగా ఉంటున్నాడని, కొ డుకును మరిచిపోకపోతే చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు చేసిం ది. అలాగే రూ.25 లక్షలు తీసుకొని తన కుమారుడిని వదిలేయాలం టూ బెదిరించారని వాపోయింది. తనని మోసం చేసి, ఇప్పుడు బెది రింపులకు పాల్పడుతున్నారని కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. యువతి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు ట్రైనీ ఐఎ ఎస్, అతని తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.