Wednesday, January 22, 2025

టర్కీలో భారత మహిళా బాక్సర్లకు శిక్షణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్లకు టర్కీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ చర్యలు చేపట్టింది. మహిళా బాక్సర్లకు 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. దీని కోసం దాదాపు కోటి రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.

దీని కోసం భారత మహిళా బాక్సర్లు గురువారం టర్కీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, యువ సంచలనం లవ్లీనాతో సహా పలువురు అగ్రశ్రేణి బాక్సర్లు ఈ బృందంలో ఉన్నారు. ఇక మే ఆరు నుంచి 21 వరకు టర్కీ వేదికగా ఎలైన్ విమెన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నీలో భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన అగ్రశ్రేణి బాక్సర్లు వివిధ కేటగిరీల్లో పోటీ పడనున్నారు. తెలుగుతేజం నిఖత్ జరీన్ 57 కిలోల విభాగంలో పోటీ పడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News