హైదరాబాద్: డ్రైవర్లకు మరిన్ని నైపుణ్యాల గురించి చెప్పేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీస్ డ్రైవర్లకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తాము సయమానికి ప్రజలకు సేవ చేయాలన్నా డ్రైవర్లు సరైన సమయానికి తీసుకువెళ్తేనే సాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ 2017లో నూతన నిబంధనలు రూపొందించిందని తెలిపారు. వాటిని డ్రైవర్లు ఫాలో కావాలని, వాటి గురించి తెలుసుకోవాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు బ్రేక్, ఎక్సలేటర్, క్లచ్ వాడకం, సీట్ బెల్టు, బైక్ నడిపే వారు హెల్మెట్లు ధరించాలని అన్నారు.
మద్యం తాగి వాహనాలు నడుపవద్దని, దీనిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆదేశించారు. డ్రైవర్ల శిక్షణ తరగతులు స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూల్‌కు ఇస్తామని తెలిపారు. డ్రైవర్లకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, 6గంటలు థియరీ, 14ప్రాక్టికల్ ట్రైనింగ్ మొత్తం 20గంటలు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 40 నిబంధనలు ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్ డ్రైవర్లు, ఎడిసిపి కవిత, స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూల్ యజమాని మాల్‌కోలోమ్ వోల్ఫ్, ఎస్ ఆది శంకర్, లవీన్ బలేరావు, సిటిసి ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎంటిఓ ఆర్‌ఐ వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు.