Wednesday, January 22, 2025

డబ్బింగ్‌ రంగంలో శిక్షణ.. నమోదుకు చివరి తేదీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ : ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలకోసం ఎదురుచూసే వారికి శుభవార్త. సినీ రంగంలో రాణించాలనుకునే యువతకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారు తెలంగాణ థియోటర్ అండ్ మీడియా రిపర్టరీ సంస్థ వారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ థియేటర్‌ అండ్‌ మీడియా రిపర్టరి సంస్థ నిర్వహిస్తున్న డబ్బింగ్‌ శిక్షణకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను గురువారం రవీంద్రభారతిలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. యువత డబ్బింగ్‌ రంగంలో శిక్షణ పొంది సినిమా రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ మామిడి హరికృష్ణ కోరారు.

నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో 45 రోజుల పాటు డబ్బింగ్‌ శిక్షణా కార్యక్రమం ఉంటుందని సంస్థ నిర్వహకుడు రమేశ్‌ కిషన్‌గౌడ్‌ చెప్పారు. ఈ శిక్షణలో డబ్బింగ్‌లో తర్పీదు పొంది డబ్బింగ్‌ కళాకారులుగా రాణించాలని సూచించారు. ఇప్పుడు సీజన్‌ -5 డబ్బింగ్‌ వాయిస్‌ యాక్టింగ్‌, వాయిస్‌ ఓవర్‌తో ముందుకు వచ్చామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు. ఆసక్తి ఉన్న యువతి, యువకులు ఏప్రిల్‌ 10వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ఫోన్‌ 7396817623ను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News