Friday, December 20, 2024

జిల్లా ఎన్నికల అధికారులకు శిక్షణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎన్నికల నిర్వహణకు సంబంధిత పలు కీలకమైన అంశాల్లో జిల్లా ఎన్నికల అధికారుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిఈవో వికాస్‌రాజ్ తెలిపారు. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల అధికారులకు (డిఈఓ) రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఓలకు నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని మెరుగుపర్చేలా పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ అఫ్తాబ్, సమగ్రంగా వివరించారు. లా అండ్ ఆర్డర్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఈ-రోల్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్‌ల చిక్కులతో సహా పలు అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అదనపు సిఈఓ లోకేష్‌కుమార్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News