Wednesday, January 22, 2025

మైనార్టీ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ

- Advertisement -
- Advertisement -

Training of minority youth in skill development courses

హైదరాబాద్: జిల్లాలో విద్యావంతులైన నిరుద్యోగ మైనారిటీ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల శిక్షణను అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ పేర్కొంది. జిల్లా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం ఎంప్యానెల్ చేయబడిన శిక్షణా సంస్దల నుండి ప్రతిపాదనలను ఆహ్వనిస్తున్నట్లు తెలిపింది. విన్నూతమైన డిమాండ్ ఆధారిత వృత్తిపరమైన అత్యధిక వేతనాలు చెల్లించే కోర్సులైన విద్య, ఆరోగ్యం, పశుసంవర్దక, డెయిరీ, వెటర్నరీ, హౌసింగ్, ఫైనాన్స్, పైపింగ్ ఇంజనీరింగ్, డిజైన్, ప్లానింగ్, మెకానికల్ ఇంజనీర్, ప్లాస్టిక్స్, విమానం మెయింటెనెన్స్, ఎయిర్ హూస్టెస్, క్యాబిన్, హార్టికల్చర్, టూరిజం, హోటల్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌వెల్డింగ్, సిసిటివి,పైర్, సేఫ్టీ, ఎల్‌ఎంవి, డ్రైవింగ్, సోలార్ ప్యానెల్ టెక్నిషియల్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ శిక్షణ, ఉపాధి ప్లేస్‌మెంట్ కార్యక్రమం ఇవ్వనున్నట్లు చెప్పారు. మైనార్టీ యువతకు శిక్షణ ఇవ్వడానికి సిద్దంగా ఉన్న శిక్షణా సంస్దలు తమ ఆసక్తి వ్యక్తీకరణతో పాటుగా నిర్ణీత ఫార్మాట్‌లో గత 3 సంవత్సరాల పనితీరుకు సంబంధించిన డాక్యుమెంట్లను సవివరమైన ప్రాజెక్టు రిపోర్టుతో జత చేసి, హార్ట్ కాపీలను విసి, ఎండీ టిఎస్‌ఎంఎఫ్‌సికి సమర్పించాలన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, ఆరవ అంతస్తు హౌజ్‌హౌస్, రజాక్ మంజిల్ పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లిలో ఈనెల 7వ తేదీవరకు అందజేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News