Monday, December 23, 2024

సర్వేయర్లకు అధునాతన టెక్నాలజీపై శిక్షణ

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సర్వేయర్లకు ఆటోకాడ్ సివిల్ 3డి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీపై ఆర్‌జి2 ఏరియా 8వ కాలనీలోని సిమ్‌టార్స్‌లో శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమైనాయి. ఆర్‌జి2 జిఎం అయిత మనోహర్, కార్పోరేట్ సర్వే జిఎం పిఎస్‌కె రవిలు ముఖ్యఅతిధులుగా హజరై ప్రారంభించారు.

రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వంద టన్నుల మిలియన్ టన్నుల లక్షంతో ముందుకు సాగుతున్న తరుణంలో కంపెనీలోని ఓపెన్‌కాస్టులపై యాజమాన్యం ఆధారపడి ఉంది. ఓపెన్‌కాస్టులలో ఓబి పనులు అత్యంత ముఖ్యమైనవి. ఖచ్చితమైన ఆఫ్‌లోడింగ్ వర్క్ నిర్వహించడానికి ఆటోకాడ్ సివిల్ 3డి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఉపయోగించడం ముఖ్యం.

సర్వే, లెక్కలు, డ్రాయింగ్, డిజైన్‌లు ఉపయోగించడానికి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సంస్థ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోని, కంపెనీకి ఉపయోగపడాలని ఇరువురు జిఎంలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిమ్‌టార్స్ ఎకెకె శర్మ, నిమ్ ఎస్‌డి హుస్సేన్, సెక్యూరిటి అధికారి పివి రమణ, ఫ్యాకల్టీ దినకర్, సర్వేయర్లు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News