హెచ్‌ఎఎల్‌తో నైజీరియా సైన్యం ఒప్పందం
బెంగళూరు: నైజీరియా సైనిక విమానయాన సంస్థకు చెందిన ఆరుగురు అధికారులకు చేతక్ హెలికాప్లర్లలో రెండవ దశ శిక్షణ ఇచ్చేందుకు నైజీరియా సైన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్) సోమవారం తెలిపింది. 2021 ఏప్రిల్‌లో ఆరుగురు నైజీరియన్ సైనిక అధికారులకు మొదటి దశ శిక్షణ కోసం ఒప్పందం కుదుర్చుకుని 2021 డిసెంబర్‌లో విజయవంతంగా అమలు చేయడం జరిగిందని, ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం దాని కొనసాగింపేనని హెచ్‌ఎఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
చేతక్ హెలికాప్టర్‌పై రెండవ దశ శిక్షణ సోమవారం ప్రారంభమై ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపింది. శిక్షణలో భాగంగా ఒక్కో నైజీరియన్ సైనిక అధికారికి చేతక్ హెలికాప్టర్‌పై 70 గంటల చొప్పున శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది. హెచ్‌ఎఎల్ హెలికాప్టర్ డివిజన్ జనరల్ మేనేజర్ బికె త్రిపాఠి, భారత్‌లోని నైజీరియా హైకమిషన్ రక్షణ సలహాదారు కమొడోర్ ఆంటోని విక్టర్ కుజో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.