Sunday, December 22, 2024

కెనడాలో కూలిన శిక్షణ విమానం..

- Advertisement -
- Advertisement -

టోరంటో : బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ శిక్షణ విమానం నేల కూలిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. శిక్షణలో ఉన్న ప్రైపర్ పీఏ 34 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ శనివారం ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్ రాముగడె మృతి చెందారని, వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన 25 ఏళ్ల వయసు వారని స్థానిక మీడియా పేర్కొంది. వాంకోవర్‌కు తూర్పున 100 కిమీ దూరంలో చిల్లివాక్ సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

విమానాశ్రయానికి సమీపాన హోటల్ వెనుక భాగంలో ఈ శిక్షణ విమానం కూలిపోయిందని పైలట్‌తోసహా విమానంలో ఉన్న వారంతా చనిపోయారని కెనడా పోలీస్‌లు వెల్లడించారు. అభయ్ గద్రూ పైలట్ శిక్షణ పూర్తి చేయడానికి మూడేళ్ల క్రితమే కెనడా వెళ్లాడు. నవంబర్‌లో గ్రాడ్యుయేట్ కావలసి ఉందని గద్రూ సమీప బంధువు సిద్ధార్ధ త్రిశాల్ చెప్పినట్టు వాంకోవర్ సన్ పత్రిక వెల్లడించింది. గద్రూ తోబుట్టువు చిరాగ్ కూడా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఉంటున్నారు. తన సోదరుని అవశేషాలను భారత్ లోని గద్రూ తల్లిదండ్రులకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News