Saturday, December 21, 2024

దేశవ్యాప్తంగా ప్రజలకు సిపిఆర్‌పై శిక్షణా కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హఠాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందచేయడంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బిఇఎంఎస్) ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. దేశవ్యాప్తంగా బుధవారం ఒకేరోజు 10 లక్షల మందికి పైగా ప్రజలకు కార్డియోపల్మనరీ రిససిటేషన్(సిపిఆర్)పై శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.

గుండెపోటుకు గురైన వ్యక్తికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందేలోగా జరిగే ప్రథమ చికిత్సనే సిపిఆర్ అంటారు. ఒక ప్రత్యేక పద్ధతిలో గుండె కండరాలపై ఒత్తిడి తీసుకురావడాన్ని సిపిఆర్‌గా పిలుస్తారు.ఇంత భారీ స్థాయిలో సిపిఆర్‌పై దేశంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారని మంగళవారం అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 10 లక్షల మందికిపైగా పౌరులకు సిపిఆర్‌పై శిక్షణ అందచేయనున్నట్లు వారు తెలిపారు. అనేక వైద్య సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కళాశాలలో పాల్గొనే ఈ కార్యక్రమంలో సామాన్య పౌరులలు, విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులకు ఆన్‌లైన్ ద్వారా సిపిఆర్ గురించి ప్రాథమిక అవగాహన కల్పించడం జరుగుతుందని అధికారులు వివరించారు. గుండెపోటుకు గురైన వ్యక్తులలో చాలామంది సకాలంలో వైద్య సహాయం అందని కారణంగా మరణిస్తున్నారని, రోగి ఆసుపత్రికి చేరేలోగా సిపిఆర్ చేయడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుందని వారు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News