హైదరాబాద్: త్వరలో జరుగనున్న ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2023 కోసం శిక్షణా కార్యక్రమాలు ఆదివారం జరిగాయి. దుర్గం చెరువు చుట్టూ 4.4 కిలోమీటర్ల ట్రాక్‌పై ఈ శిక్షణ జరిగింది. దాదాపు 500 మందికి పైగా రన్నర్లు ఈ శిక్షణా సదస్సులో పాల్గొన్నారు. ఈ మారథాన్ కోసం అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ సమయంలో ఇది కనిపించింది. ఈ శిక్షణా ప్రాంగణం వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తమ పేర్లను నమోదుచేసుకున్నారు. జనవరి 29, 2023న మూడవ ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2023 జరుగనుంది.
ఈ సంవత్సరారంభంలో రెండవ ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ జరిగింది. దాదాపు 3వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ అప్పుడు జరిగాయి. ఈ సంవత్సరం రన్నర్లు 5 కిలోమీటర్ల రన్, 10 కిలోమీటర్ రన్‌తో పాటుగా 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌లో కూడా పాల్గొనవచ్చు. ఎర్లీ బర్డ్ ఆఫర్ ను నవంబర్ 30, 2022 వ తేదీ వరకూ పొడిగించారు. టిక్కెట్ల ధరలను 599 రూపాయలుగా 5కె రన్, 1099 రూపాయలకు 10కె రన్, 1399 రూపాయలను 21 కె రన్‌కు నిర్ణయించారు.రన్‌లో పాల్గొనేందుకు https://click2race.com/#/event/BJSth0pxo చూడండి.