Tuesday, November 5, 2024

పలు మార్గాల్లో రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

Trains canceled on many routes

హైదరాబాద్ : భారతీయ రైల్వే సంస్థ దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూ పుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సిల్ చేసింది. ఇందు లో 115 రైళ్లను పూర్తిగా రద్దుచేస్తున్నామని, మరో 48 సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఇది సోమవారం (అక్టోబర్ 10) ఒక్కరోజు మాత్రమేనని, తదుపరి సమాచారం అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లకు సంబంధించి ముందుగానే బుక్ చేసుకున్న టికెట్లను రద్దుచేస్తున్నామని ఐఆర్సీటీసీ తెలిపింది. కౌంటర్లలో టికెట్లు కొనుగోలుచేసినవా రు అధికారులను సంప్రదించాలని సూచించింది. మరోవైపు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఇందులో పలు సింగిల్ వే రైళ్లు కూడా ఉన్నాయి.

సికింద్రాబాద్- యశ్వంతపూర్ (07151) రైలు సోమవారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనున్నది. యశ్వంతపూర్ -సికింద్రాబాద్ (07152) రైలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. రెండు రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెహలంక స్టేషన్ల లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే సోమవారం పూర్ణా- తిరుపతి మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్ (07633)ను నడుపనున్నట్లు చెప్పింది. రైలు రా త్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రా త్రి 10.10 గంటలకు గమ్యస్థానానికి చేరనున్నది. ఈ నెల 12న నర్సాపూర్- తిరుపతి, విజయవాడ- ధర్మవరం మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్‌ను నడుపనున్నట్లు పేర్కొంది. నర్సాపూర్- తిరుపతి (07130) రాత్రి 8.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని, విజయవాడ- ధర్మవరం (07131) రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News