Monday, December 23, 2024

విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు ఈ నెల 14వ తేదీన తాడి, అనకాపల్లి స్టేషన్ల మధ్య గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో భద్రతా పనుల దృష్ట్యా రైల్వేశాఖ ఈ మార్గంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 18వ తేదీన విశాఖపట్నం, -గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17240), 18న విశాఖపట్నం, -మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (నం.17220) రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News