Monday, December 23, 2024

రైళ్ల ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా పలు రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

రైళ్ల ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా
24 సాధారణ రైళ్లు, 22 ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు
నేటి నుంచి ఈనెల 09వ తేదీ వరకు ప్రయాణికులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి
దక్షిణ మధ్య రైల్వే సూచన
మనతెలంగాణ/హైదరాబాద్:  రైళ్ల ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. నేటి నుంచి ఈనెల 09వ తేదీ వరకు 24 సాధారణ రైళ్లను, 22 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. లింగంపల్లి, ఫలక్‌నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటిఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నగరంలోని ప్రయాణికులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈవిషయమై సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రద్దయిన 24 సాధారణ రైళ్ల వివరాలు…

కాజీపేట- టు డోర్నకల్, విజయవాడ- టు డోర్నకల్, భద్రాచలం టు -విజయవాడ, విజయవాడ- టు భద్రాచలం, సికింద్రాబాద్ టు -వికారాబాద్, వికారాబాద్- టు కాచిగూడ, సికింద్రాబాద్ టు -వరంగల్, వరంగల్- టు హైదరాబాద్, సిర్పూర్ టౌన్ టు -కరీంనగర్, కరీంనగర్- టు నిజామాబాద్, కాజీపేట- టు సిర్పూర్ టౌన్, బల్లార్షా- టు కాజీపేట, భద్రాచలం- టు బల్లార్షా, సిర్పూర్ టౌన్- టు భద్రాచలం, కాజీపేట- టు బల్లార్షా, కాచిగూడ- టు నిజామాబాద్, నిజామాబాద్- టు నాందేడ్ తదితర రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే వీటితో పాటు కాచిగూడ- టు మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉందానగర్ వరకు నాందేడ్- టు నిజామాబాద్, -పండర్పూర్ ఎక్స్‌ప్రెస్ ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఎంఎంటిఎస్ రైళ్ల వివరాలు ఇలా….

లింగంపల్లి- టు హైదరాబాద్, హైదరాబాద్ టు -లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి- టు ఉందానగర్ మధ్య నడిచే 3 రైళ్లు, లింగంపల్లి- టు ఫలక్‌నుమా మధ్య నడిచే రెండు ఎంఎంటిఎస్ రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఉందానగర్- టు లింగంపల్లి మధ్య నడిచే 4 రైళ్లను ఫలక్‌నుమా టు -లింగంపల్లి మధ్య రెండు రైళ్లను, రామచంద్రాపురం టు -ఫలక్ నుమా మధ్య నడిచే ఒక ఎంఎంటిఎస్ రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News