Monday, December 23, 2024

తాడి-అనకాపల్లి సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతులు… పలు రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

 

విశాఖపట్నం: తాడి-అనకాపల్లి సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతుల వల్ల పలు రైళ్లను రద్దు చేయనున్నారు. గురువారం, శుక్రవారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్, గురువారం, శుక్రవారం, శనివారం విశాఖ-గుంటూరు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు రద్దు చేశారు. విశాఖ-విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం రద్దు చేశారు. వందేభారత్ రైలు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఆలస్యంగా బయలుదేరనుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 9.30 నిమిషాలకు బయలుదేరనుంది. ఇవాళ షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్సప్రెస్, రేపు సికింద్రాబాద్-షాలిమార్, ప్రశాంతి నిలయం-హావ్‌డా ఎక్స్‌ప్రెస్, విశాఖ -దిఘా ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు.

Also Read: అమిత్ షాపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News