Wednesday, January 22, 2025

ఖమ్మం మీదుగా వెళ్ళే పలు రైళ్ళు రద్దు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం  : ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదగా నడిచే పలు రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే ఈనెల 16వ తేదీ వరకు పొడిగించింది. రోలింగ్ బ్లాక్ కార్యాచరణ ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లకు అధికారులు సమాచారం పంపించారు. పనులు పూర్తికాలేదంటూ జూన్ 19వ తేదీ నుంచి రైళ్ల రద్దును అధికారులు పొడిగించుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ బాగుంటున్నప్పటికి కొన్ని మార్గాల్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది.

అటువంటి మార్గాలను గుర్తించి అటువైపు ప్రయాణించే అన్ని రైళ్ల ఏసీ టికెట్ ధరలను 25 శాతం తగ్గించారు.ఆదరణ తక్కువగా ఉండే రైళ్లకే ఈ పెంపెను వర్తింప చేస్తారు. ధరలను తగ్గించే అధికారాన్ని ఆయా డివిజన్ల పరిధిలోని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్లకు కట్టబెట్టారు. గత 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లను దీనికోసం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News