- Advertisement -
పారిస్: రైలు పట్టాల దగ్గర శుక్రవారం రెండవ ప్రపంచం యుద్ధం నాటి పేలని బాంబులను కనుగొనడంతో లండన్‌కు వెళ్లే యూరోస్టార్ రైళ్లు, ఉత్తర ఫ్రాన్స్‌కు వెళ్లే అన్ని రైళ్లను ఆపేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు గారే డు నోర్డ్ వద్ద మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ నిలిపేస్తామని ఫ్రాన్స్ జాతీయ రైలు ఆపరేంటర్ ఎస్‌ఎన్‌సిఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తాలూకు మిగిలిపోయిన బాంబులు ఫ్రాన్స్ పరిసరాల్లో తరచూ దొరుకుతుంటాయి. అయితే జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో వాటిని కనుగొనడం అన్నది చాలా అరుదు.
- Advertisement -