Wednesday, December 18, 2024

రైళ్ల ట్రయల్ రన్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

కేసముద్రం- ఇంటికన్నె మధ్య రైల్వే ట్రాక్ రెడీ
రైల్వే ట్రాక్ అప్‌లైన్ పునరుద్ధరణ..నేటి నుంచి మళ్లీ రైళ్ల రాకపోకలు

మన తెలంగాణ/కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య అసంపూర్తిగా ఉన్న రైల్వే ట్రాక్ అప్ లైన్‌ను రైల్వే అధికారులు బుధవారం పునరుద్ధరించారు. గత మూడు రోజులుగా కేసముద్రం స్టేషన్‌లో నిలిపిన సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం వరంగల్ వైపు పంపగా ట్రయల్ రన్ విజయవంతమైంది. గుంటూరు నుండి గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఐదు గంటలు ఆలస్యంగా నడిచింది.

డౌన్‌లో నడిచే నాగర్‌సోల్, కృష్ణా ఎక్స్‌ప్రెస్ యధావిధిగా నడిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య వరద ఉధృతికి ట్రాక్ కొట్టుకుపోగా 600 మంది కూలీలు, 200 మంది అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి ట్రాక్‌ను సరిచేశారు. బుధవారం రాత్రి వరకు అప్‌లైన్ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించి గురువారం నుండి రైళ్ల రాకపోకలు యధావిధిగా ఉంటాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News