Thursday, November 14, 2024

సింగరేణి నుండి ట్రాన్స్‌కోకు ఏటా రూ. 420 కోట్ల ఆదాయం !

- Advertisement -
- Advertisement -
ఇప్పటికే సింగరేణి సోలార్ ప్లాంట్ల ప్రొడక్షన్ 617.02 మిలియన్ యూనిట్లు !!

హైదరాబాద్ : సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సింగరేణి సంస్థ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టాలని 2018 లోనే నిర్ణయించుకున్న సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా మరింత ముందుకు అడుగులు వేస్తోంది. ఏటా తన గనులు, కాలనీల అవసరాల కోసం సుమారు 750 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగించుకుంటూ యూనిట్‌కు సగటున రూ. 8 చొప్పున తెలంగాణ ట్రాన్స్‌కోకు ఏటా  420 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లిస్తోంది. తద్వరా అటు ఆర్‌టిసికి ఏటా భారీగానే ఆదాయం సమకూరుతోంది.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తన పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ ఖాళీ ప్రదేశాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే విద్యుత్ ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చన్న యోచనలో భాగంగా సింగరేణి సిఎండి శ్రీధర్ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఆవిర్భావం తరువాతనే మొదటిదశలో మొత్తం 300 మెగావాట్ల సామర్ధంతో 14 ప్లాంట్లను సింగరేణి ఎనిమిది ఏరియాల్లో చేపట్టగా వీటిలో ఇప్పటికే 224 మెగావాట్ల సామర్ధం గల ప్లాంట్లు పూర్తయి విజయవంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తం 9 ప్లాంట్ల నుండి (2023 ఏప్రిల్ నాటికి) 617 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. తద్వారా సింగరేణి సంస్థ చెల్లించే కరెంటు బిల్లులలో రూ. 250 కోట్లకు పైగా సింగరేణికి ఆదా అయింది. ఈ నేపథ్యంలో మొదటి దశలో 300 మెగావాట్ల ప్లాంట్లలో ఇంకా మిగిలి ఉన్న 76 మెగావాట్ల ప్లాంట్లను మరో 3 నెలల్లో పూర్తి చేయాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ఆదేశించడం గమనార్హం. మొదటి దశ 300 మెగావాట్ల ప్లాంట్లకు అదనంగా మరో 240 మెగావాట్ల సామర్దం గల సోలార్ ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా 8 ఏరియాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇదే
కాగా సింగరేణి సంస్థ చేపడుతున్న సోలార్ ప్లాంట్‌లకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని అందించే రిజర్వాయర్ నీటిపై ఇప్పటికే 5 మెగావాట్ల సామర్ధం గల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించగా అదే రిజర్వాయర్‌లోని మరో భాగంలో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును కూడా ప్రస్తుతం నిర్మిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇదే కావడం మరో విశేషం. ఈ ప్లాంట్ల నిర్మాణం శర వేగంగా పూర్తి కావడంలోనూ, సమర్ధంగా విద్యుత్ ఉత్పాదన జరపడంలోనూ సింగరేణి ప్రత్యేక చొరవ చూపి ప్రతి నెలా నిర్మాణ ప్రదేశాలను విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లను పర్యటిస్తుండడం గమనార్హం. కాగా ఇది సింగరేణి సంస్థకు కావలసిన ఉన్న , ప్రస్తుతం వినియోగిస్తున్న 750 మిలియన్ యూనిట్ల కన్నా ఎక్కువే కనుక సింగరేణి సంస్థ దేశంలోనే సోలార్ విద్యుత్ ద్వారా నడుస్తున్న ఒక భారీ పరిశ్రమగా ఖ్యాతికెక్కనుంది. థర్మల్ విద్యుత్ అవసరాలకు పరిపడా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలను “ నెట్ జీరో ఎనర్జీ ” సంస్థలుగా పేర్కొంటారు. కావున సింగరేణి అనతి కాలంలోనే నెట్ జీరో ఎనర్జీ కంపెనీగా పేరు తెచ్చుకోవడం కూడా ఖాయం అని పలువురు పేర్కొంటున్నారు.

సింగరేణిలో సోలార్ ప్లాంట్ల ప్రొడక్షన్ 617.02 మిలియన్ యూనిట్లు !!
సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో ప్రారంభించిన సోలార్ ప్లాంట్లు ప్రారంభం నుంచి గత ఏడాది ఏప్రిల్ వరకు ఇలా ఉన్నాయి. మణుగూరులో ( 30 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 111.42 మి.యూ ఉత్పత్తి అవుతోంది. ఎన్‌టిపిసి (10 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 45.52 మి. యూ ఉత్పత్తి అవుతోంది. రామగుండం – 3 ( 50 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 90.80 మిలియన్ యూనిట్లుగా ఉంది. భూపాలపల్లి ( 10 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 30.19 మిలియన్ యూనిట్లుగా ఉంది. కొత్తగూడెం (37 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 84.49 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఎన్‌టిసిపి ( ఫ్లోటింగ్ ) 05లో ప్రొడక్షన్ 1.89 మిలియన్ యూనిట్లుగా ఉంది. రామగుండం – 3 (50 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 90.80 మిలియన్ యూనిట్లుగా ఉంది. భూపాలపల్లి ( 10 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 30.19 మిలియన్ యూనిట్లుగా ఉంది. కొత్తగూడెంలో (37 మెగావాట్లు ) కాగా ప్రొడక్షన్ 84.49 మిలియన్ యూనిట్లు ఉంది. ఇల్లందు 39 మెగావాట్లు కాగా ప్రొడక్షన్ 116. 48 మిలియన్ యూనిట్లు ఉంది. మందమర్రి స్టేజ్ -1 (28 మెగావాట్లు) కాగా ప్రొడక్షన్ 186.34 మిలియన్ యూనిట్లుగా ఉంది. మందమర్రి స్టేజ్ -2 (15 మెగావాట్లు) కాగా ప్రొడక్షన్ 49.90 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఇలా మొత్తం సోలార్ ప్లాంట్ల కెపాసిటీ 224 మెగావాట్లు కాగా మొత్తం ప్రొడక్షన్ 617.02 మిలియన్ యూనిట్లుగా ఉండడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News