Friday, April 4, 2025

ముగ్గురు ఐపిఎస్‌లకు స్థానచలనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నా యి. తాజాగా మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ విశ్వప్రసాద్‌ను పోలీస్ ఆర్గనైజేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమించారు. హైదరాబాద్ సిటీ క్రైమ్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అదనపు కమిషనర్ ఎవి రంగనాథ్‌ను బదిలీ చేసి ఆయనను హైదరాబాద్ మల్టీ జోన్1 ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమించారు.

ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న సుధీర్ బాబును రిలీవ్ చేశారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డిసిపి శరత్ చంద్ర పవార్ బదిలీ అయ్యారు. తెలంగాణ స్టేట్ నార్కొటిక్స్ బ్యురో ఎస్పీగా ఆయన అపాయింట్ అయ్యారు. ఇదివరకు మొత్తం 12 మంది ఐపిఎస్‌లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. మల్టీ జోన్-1 ఐజిపిగా నియమించారు. అక్కడున్న తరుణ్ జోషిని రాచకొండ పోలీస్ కమిషనర్‌గా అపాయింట్ చేశారు. శ్రీనివాసులుకు రామగుండం పోలీస్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News