Thursday, January 23, 2025

సైబరాబాద్‌లో పది మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పదిమంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న వెంకటేశ్వర్ రావును సూరారం ఎస్‌హెచ్‌ఓగా, రాయదుర్గం డిఐ రాజగోపాల్‌రెడ్డిని జినోమ్‌వ్యాలీ పిఎస్ ఎస్‌హెచ్‌ఓగా, ఎస్‌ఓటి రాజేంద్రనగర్ ఇన్స్‌స్పెక్టర్ కుందూరు వెంకట్‌రెడ్డిని అల్లాపూర్ ఎస్‌హెచ్‌ఓగా, కంట్రోల్ రూమ్ ఇన్స్‌స్పెక్టర్ పులి యాదగిరిని అత్తాపూర్ ఎస్‌హెచ్‌ఓగా, ఆర్‌సిపురం ఇన్స్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్‌ను కొట్లూరు ఎస్‌హెచ్‌ఓగా, సైబర్ క్రైంలో పనిచేస్తున్న నరేష్‌ను మోకిలా ఎస్‌హెచ్‌ఓగా, సానా శ్రీనాథ్‌ను రాయదుర్గం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా, సైబర్ క్రైంలో పనిచేస్తున్న నరేందర్‌రెడ్డిని ఆర్‌సి పురం ఎస్‌హెచ్‌ఓగా, సిసిఆర్‌బిలో పనిచేస్తున్న వెంకట్‌రెడ్డిని జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా, జిడిమెట్ల ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌ను సిపిఓకు అటాచ్డ్ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News