Monday, December 23, 2024

105 మంది పంచాయతీ రాజ్ శాఖ అధికారులు బదిలీ

- Advertisement -
- Advertisement -

జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, డిపిఓలకు స్థానచలనం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల బదిలీల కొనసాగుతున్నది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం సోమవారం పంచాయతీరాజ్‌శాఖలోని అధికారులను బదిలీ చేసింది. పంచాయతీరాజ్‌శాఖలో పని చేస్తున్న 105 మంది అధికారులను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన అధికారుల్లో జడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలతో పాటు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ అయ్యారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News