Monday, December 23, 2024

11 మంది డిఎస్పిల బదిలీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 11మంది డిఎస్పిలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. పసుపులేటి సుబ్యయ్యను బంజారాహిల్స్ ఎసిపిగా నియమించారు, అక్కడ పనిచేస్తున్న శ్రీధర్‌ను డిజిపి ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కాపుగాని శ్రీనివాసరావును ములుగు డిఎస్పిగా నియమించారు. ములుగు డిఎస్పి నలువాల రవీందర్‌ను డిజిపి ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

మారెళ్లి సుమన్‌కుమార్‌ను రాచకొండ సిసిఆర్‌బి ఎసిపిగా, విక్రం దేవ్‌ను హైదరాబాద్ సిటిసి ఎసిపిగా, నరేందర్‌గౌడ్‌ను రాచకొండ కమాండ్ కంట్రోల్ ఎసిపిగా, సోమ వెంకట్‌రెడ్డిని రాచకొండ సైబర్ క్రైం ఎసిపిగా, ఎన్. వాసును రాచకొండ ఎస్‌ఓటి 1 ఎసిపిగా, మట్టయ్యను రాచకొండ ఎస్‌ఓటి2 ఎసిపిగా, ఎండి వహీదుద్దిన్‌ను వెస్ట్‌జోన్ రోడ్డు సేఫ్టీ డిఎస్పిగా నియమించారు. బదిలీ అయిన వారు వారి స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News