Monday, December 23, 2024

తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిగా దాన కిశోర్ ను నియమించింది. హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్ గా దానకిశోర్ కి అదనపు బాధ్యతలను అప్పగించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించింది. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలను అప్పగించింది. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శగా వాణి ప్రసాద్ నియమితులయ్యారు.

ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా వాణిప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్ శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలిచ్చారు. వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ గా టి.కె శ్రీదేవి, మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శింగా వాకాటి కరుణ. నల్గొండ కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News