Thursday, December 19, 2024

సైబరాబాద్‌లో 16 మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 16మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కొత్తూరు, బాచుపల్లి ఇన్స్‌స్పెక్టర్లు శంకర్‌రెడ్డి, సుమన్‌కుమార్‌ను బదిల చేశారు. సుమన్ కుమార్‌ను రాజేంద్రనగర్ సిసిఎస్, శంకర్‌రెడ్డిని నార్కోటిక్ ఆపరేషన్ టీంకు బదిలీ చేశారు. మాదాపూర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ శివప్రసాద్‌ను సిసిఆర్‌బికి బదిలీ చేశారు, మాదాపూర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్‌గా విజయ్‌వర్దన్‌ను నియమించారు. బాలానగర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ రాహుల్ దేవ్‌ను అల్వాల్ ఎస్‌హెచ్‌ఓగా, గుడి పవన్‌కుమార్ రెడ్డిని మోయినాబాద్ ఎస్‌హెచ్‌ఓగా, నర్సింహరావును కొత్తరు ఎస్‌హెచ్‌ఓగా, కొక్కొండ బాలరాజును ఆర్‌జిఐ పిఎస్ ఎస్‌హెచ్‌ఓగా, కుందూరు వెంకట్‌రెడ్డిని మేడ్చల్ డిఐగా బదిలీ చేశారు. నాగిరెడ్డిని బాలానగర్ డిఐగా నియమించారు.

ముగ్గురు ఇన్స్‌స్పెక్టర్లు రేంజ్‌కు….
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నార్సింగి ఇన్స్‌స్పెక్టర్ వి. శివకుమార్, మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ ఎన్.తిరుపతి, అల్వాల్ ఇన్స్‌స్పెక్టర్ వి.ఆనంద్‌కిషోర్‌ను రేంజ్‌కు సరెండర్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News