Sunday, December 22, 2024

నగరంలో 45మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

Transfer of 45 inspectors in hyderabad city

ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

మనతెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 45మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గోల్కొండ ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని సిసిఎస్‌కు బదిలీ చేసి ఆయన స్థానంలో నూనె వెంకటేశ్వర్లును నియమించారు. సిసిస్‌లో పనిచేస్తున్న సుంకరి శ్రీనివాసరావును టపాచపుత్ర ఇన్స్‌స్పెక్టర్‌గా అక్కడ ఎస్‌హెచ్‌గా పనిచేస్తున్న సంతోష్‌కుమార్‌ను వెస్ట్‌జోన్ పిసిఆర్‌కు బదిలీ చేశారు. సైఫాబాద్ డిఐ బానోతు రాజు నాయక్‌ను నాంపల్లి డిఐగా బదిలీ చేశారు. నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎండి ఖలీల్ పాషాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. వెస్ట్‌జోన్‌లో టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్‌గా ఉన్న శ్రీనాథ్ రెడ్డిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. రామలక్ష్మణ రాజును కాబీగూడ ఎస్‌హెచ్‌ఓగా,కాలాపత్తర్ ఇన్స్‌స్పెక్టర్‌గా నాగేల్లి బుచ్చయ్యను నియమించారు. తేజావత్ కొమురయ్యను సిసిఎస్ నుంచి కమాటిపుర ఎస్‌హెచ్‌ఓగా, చాదర్‌ఘాట్ ఇన్స్‌స్పెక్టర్‌గా ప్రకాష్ రెడ్డిని నియమించారు. బదిలీ అయిన వారు వారికి కేటాయించిన స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News