Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో 53 మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

ఆదేశాలు జారీ చేసిన సిపి శ్రీనివాస రెడ్డి

మనతెలంగాణ, సిటిబ్యూరోః  హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 53 మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఇన్స్‌స్పెక్టర్లను మల్టీజోన్ 2కు సరెండర్ చేశారు.

ఇందులో బహదుర్‌పుర ఇన్స్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, ఫిలిం నగర్ ఇన్స్‌స్పెక్టర్ మోర్లాగురు శివరామకృష్ణ, చిలకలగూడ డిఐ తేజావత్ శ్రీశైలం నాయక్‌ను మల్టీ జోన్ 2కు సరెండర్ చేశారు. అత్యంత వివాదాస్పదమైన జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్ రెడ్డిని నియమించారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, బోరబండ ఎస్‌హెచ్‌ఓలను బదిలీ చేశారు. బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్‌ను ఎస్‌ఆర్ నగర్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News