రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 44 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించగా, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించగా, దేవాదాయ శాఖ, చేనేత, హస్త కళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యను ప్రభుత్వం నియమించింది. అహ్మద్ నదీమ్‌కు అటవీ, పర్యావరణ శాఖలతో పాటుగా టిపిటిఆర్‌ఐ డిజిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీ, జీఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.